Thursday, 20 November 2014

ఓ లోకమా!



 - శాంతి ప్రియ

నీ ధన ప్రీతి గూర్చి నే పాడలేను
దైవ ఘన కీర్తిని నే వీడలేను 

నేను చూశాను ఐహిక లాలసతో వివేకం 
కోల్పోయిన అవివేకుల్ని
నేను చూశాను కామంతో కళ్ళు
మూసుకుపోయిన నర రూప రాక్షసుల్ని
నేను చూశాను మద్యం మత్తులో జూదం
ఆడుతూ మగువలకు వెల కట్టిన కుబేరుల్ని 

అందుకే-
నీ మాయ మాటలను నే నమ్మలేను
మహా ప్రవక్త మహితోక్తులను నే మరువలేను

నేను చూశాను మత కలహాల్లో మాడి
మసి అయిన మహిళామణుల్ని, పసి పిల్లల్ని
నేను చూశాను నిరంకుశ నమ్రూదులను
మృగరూప నరేంద్రులను, ఫిర్‌ఔన్‌, హామానులను
నేను చూశాను అలగా జనాల అత్యాచారానికి
బలైన అబలలను, నిండు గర్భిణులను
నేను చూశాను నిజంగా త్రిశూల కొనలకు
వ్రేలాడుతున్న మూడు మాసాల పసి కూనలను
నేను చూశాను నిజంగా తుపాకీ తూటాలకు 
తూట్లు పడిన తల్లి హృదయాన్ని,, ఇరాక్‌, ఫలస్తీనాల్ని

అందుకే-
నీ చదరంగానికి నే పావుని కాలేను
మహితాత్ముల బాట నే వదలలేను

నేను చూశాను మూర్తీభవత్‌ దైన్యాన్ని, హైన్యాన్ని
రుద్ధభాష్పాకులిత నయనుడైన వృద్ధ తండ్రిని
నేను చూశాను కన్య కొంగు చాటు కృష్ణుడై
కన్నవారిపై కన్నెర్రజేసిన కసాయి కొడుకుల్ని
నేను చూశాను కనక వ్యామోహంతో కొడుకుల్ని
అమ్మేసుకుంటున్న కట్న పిపాస పిత్రోత్తముల్ని
ఇది ఏ నాగరికతకు ఫలశ్రుతి? ఏ జ్ఞాని జన్మభూమి
గర్వ స్థితి?

నేను పైన దైవానికి జవాబు చెప్పవలసినవాణ్ణి
క్రింద దాసుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండాల్సినవాణ్ణి
అందుకే ఓ లోకమా!
నీ వశీకరణ మంత్రాలకు నే లొంగను
క్షంతవ్యంకాని అలసత్వం నే వహించను
                                        
                                         

ఆగామి యుగాలకాయన ఆదర్శప్రాయుడు



by - సయ్యిద్ అబ్దుస్సలామ్ ఉమ్రీ

జాడ్యం నిండిన మౌఢ్య పాలనలో -
నిజం కరువైన నీలి సమాజంలో
ఒకే ఒక్కడు అయిన వ్యక్తి ఒక
మహా శక్తయి, మానవ నిర్మాతయి
సౌజన్య ప్రదాతయి, సాత్విక దూతయి
సాగర సహనంతో సత్య శంఖాన్ని
పూరించిన ఉదంత మేనాటికీ
స్ఫూర్తినిస్తూనే ఉంటుంది లోకానికి

సత్యాన్ని బోధించిన నూహ్‌ా
నియంతల్ని నిలదీసిన ఇబ్రాహీమ్‌
దళిత జనాల పక్షం వహించిన మూసా
సహనానికి తానే ప్రతీకగా నిలిచిన అయ్యూబ్‌
సమాజ శ్రేయస్సు కోసం శిరస్సు అర్పించిన యహ్యా
ధర్మోన్నతికై ప్రాణాలర్పించిన జకరియ్యా
సమానతను బోధించిన ఈసా
క్షమా గుణం తానై నిలిచిన ముహమ్మద్‌
సహన సంపద శాంతి ప్రేమలకు శాశ్వత వారసులు

ఏ ఘోరం చేశాడు బిలాల్‌?
ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌
మండుటెండల్లో మాడే నల్ల సూరీడు
విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి
మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా
అహద్‌, అహద్‌ అని జపించినందుకా
అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?
ఆ మనీషి సహనం పరీక్షకే పరాకాష్ఠ
అధికారం అడగలేదు ఖబ్బాబ్‌
అపకారం చేయలేదు ఉస్మాన్‌
అన్యాయం తలపెట్టలేదు అమ్మార్‌
అధర్మానికి పాల్పడలేదు యాసిర్‌
అసత్యానికి వత్తాసు పలుకలేదు సుమయ్యా
దమన నీతికి దాసోహమనలేదు ముస్‌ఆబ్‌
స్వామి ద్రోహానికి ఒడిగట్టలేదు ఉమ్మె సలమా

ఎందుకు వారు శిక్ష భరించారు తమ
మూపున ఎందుకు నాటారు మేకులు  తనవున
అజ్ఞాన ముసుగు విప్పినందుకా?
మిథ్యా వాదుల్ని నిలదీసినందుకా?
నిజ దైవం అల్లాయేనని నిగ్గు తేల్చినందుకా?
వీడని మిస్టరీ హిస్టరీని ఛేదించినందుకా?
ఏమి తెలుసీ ముష్కరులకు, ముష్రికులకా
మహా ప్రవక్త మహోపదేశం? చిందే
రక్తం, అయ్యే గాయం చేసే ఆర్తనాదం -
''అల్లాహుమ్మహ్‌ాది ఖౌమీ ఫయిన్నహుమ్‌ లా
యాలమూన్‌'' -ప్రభూ! నా జాతి జనులకు
సన్మార్గ భాగ్యం ప్రసాదించు. వారు నన్ను,
నిన్నూ గ్రహించలేని వట్టి అమాయకులు స్వామీ!!

ఆర్ద్రంగా ఉంటూనే రుద్రంగా
ధీరంగా ఉంటూనే దుర్గంగా
సంకల్ప వజ్రం ధరియించి
కారుణ్య వర్షం కురిపించి
అభిగమించు సమ చిత్తుడు
ఆగామి యుగాల కాయన
ఆదర్శప్రాయుడు.

Wednesday, 18 June 2014

మస్తిష్క సముద్రం


ముహమ్మద్ ఖాన్ (గన్న వరం) 

స్తబ్ధంగా ఉన్నది ఏదైనా
ప్రాణి ఎలా అనిపించుకుంటుంది?
చలనం, జలమునకైనా అనివార్యం!

చిరు తటాకమునకైనా
చిన్నారి అలల కేరింతలే చలనం

సరస్సయినా, నదయినా
అలలే కదా చలనం

కెరటాలు లేని సముద్రం ఏది?
అది, సమద్రమెలా అనిపించుకుంటుంది?

నిత్యం సంఘర్షణ
తీరంలోనే, కెరటంలోనే విభేదం
ఏ ఒక్క కెరటమన్నా
మౌనంగా తీరం తాకిందా?
ఏ ఒక్క కెరటమయినా
స్తబ్ధంగా ప్రక్కకు తప్పుకున్నదా?
మస్తిష్కంలో
ఏదో ఒక ఆలోచన
కెరటమై ఎగసిపడనిదే
అది
మస్తిష్కం ఎలా అనిపించుకుంటుంది?
మస్తిష్కం
మహా సముద్ర ఘోష
కెరటాలు
కోకొల్లలు ఉద్భవించటం
ప్రవహించటం
కొన్ని తీరం తాకకనే మరుగైపోవటం
మరి కొన్ని
సుడులయి, అల్ప పీడనములయి
అతలాకుతలం చేయటం
సునామీలై విరుచుకు పడటం
ప్రకృతి వైపరీత్యమై చెలరేగటం
ఇదేం క్రొత్త కాదు కదా!

మహా సముద్రముకన్నా
మస్తిష్క సముద్రం అంతులేనిది
ముకుళించుకుపోయిన మస్తిష్కానికి ఇది
ఎలా అర్థమవుతుంది?


మానవ జన్మ చరితార్థం అవ్వాలంటే..?



శాంతి ప్రియ

సత్య వ్రియుల బలం వెరగాలి
అక్రమార్కుల అహం అణగాలి
శాంతి కాముకుల శ్రమ ఫలించాలి
కాంతి విద్రోహుల మదం తుంచాలి

స్వర్గం మన సొంతమవ్వాలంటే
సత్యార్తి రగలాలి, ధర్మ స్థాపన జరగాలి
నీలో నాలో మనందరిలో
స్నేహ వల్లి వెల్లి విరియాలి

కుట్రలు కుతంత్రాల పన్నొద్దు ఏ కులం వేరుతో
దమన నీతి, దహన కాండలు జరుపొద్దు మతం వేరుతో
నిఖిల జీవులంతా దైవ కుటుంబీకులనీ, దాసులనీ
పరస్పరం సోదరులుగా మసలుకోవాలనీ
మహాప్రవక్త ముహమ్మద్‌ =(లి) బోధించిన ప్రవచనాలు
ఇహపరాల సాఫ¦ల్య సాధనాలు మానవతను
వెలిగించే మణి దీపాలు హృదయ గీతాలు

ఎదుటివారిని ద్వేషించమని
ఏ బుద్ధుడూ బోధించడు
ఇరుకు బుద్ధులు వెంచుకోమని
ఏ రాముడూ ప్రవచించడు
అందరు శుభాత్మల సందేశం
ఏకేశ్వరోపాసనం, లోక కళ్యాణం
ఆ మాటయే దైవదర్శన భాగ్యాన్ని
అందించే సోపానం

తుపాకి తూటాలు, బాంబు వేలుళ్ళతో
నర రుధిరమే సాగించమని ఏ ఈసా చెప్పడు
జన ధన ప్రాణాలు, ప్రాణాధికమైన మానాలకు
నష్టం కలిగించమని ఏ మూసా అనడు
స్వార్థం కోసం సలివే ప్రార్థన వ్యర్థం
దైవ ప్రసన్నత విపాసతో సత్కార్యాలు
చేసే నరోత్తముల జీవితం చరితార్థం.

Wednesday, 26 March 2014

సర్వం నీకే అర్పింతు దేవా!

shanti priya

కటిక పేదల్ని సహాయం చేసే
కడు వినమ్రతతో నిన్ను అర్ధించే
రెండు హస్తాలు దేెవా! మా
ఈ రెండు చేతులు

మసక చీకటిని పారద్రోలే
ఉషః కాంతికి బాట వేసే
నీ ప్రవక్త సుభాషితాల నీడలో
నడిచే రెండు అడుగులు దేవా! మా
ఈ రెండు పాదాలు

నీడలా వెన్నంటి వేధించే
నిరంతర జీవిత సమస్యలను నిర్మలంగా
కరుణామయ రీతిలో పరిష్కరించే
పవిత్ర ఖుర్‌ఆన్‌ మహా ధుని
సుమధుర ధ్వనులు శ్రావ్యానందంగా
ఆలకించే రెండు వీనులు దేవా! మా
ఈ రెండు చెవులు

ఫజ్ర్‌ వేళ నిదుర లేచి
ప్రార్థనలో రుకూ సజ్దాలు చేస్తూ
అమృతవాణి పారాయణం చేస్తూ
నిన్నే తలపోసే, నీ సేవలోనే
నిత్యము తన్మయం చెందే
నీ స్మరణలోనే నిరతం నిను దర్శించే
రెండు నేత్రాలు దేవా! మా
ఈ రెండు కళ్ళు

అదయుల తమస్సుని తొలగించే
సదయుల ఉషఃస్సుని వెలిగించే
నిరతము దివ్య జ్యోతి పారాయణ పారీణత
శ్రవణములోనే పరవశించే
ఎన్నడూ విడవక నిన్నే
ఏక చిత్తంతో సంకీర్తించే
ఒకే హృదయం దేవా! మా
ఈ ఒకే ఒక్క మనసు

కామ క్రోధ, మద లోభాలనూ
మా మది నుండి తొలగించు దేవా!
నీ పవిత్ర నామ, అశేష గుణ వర్ణమున
మేను మరచి ఓలలాడేలా దీవించు దేవా!

మా చేతులకు సంకెళ్ళు వేసినా
మా కాళ్ళకు గొలుసులు కట్టినా
చీకటి చెరసాలలో మమ్మల్ని బంధించినా
స్వచ్ఛమైన, సత్యమైన నీ ధర్మాన్ని
చచ్చినా వదులకోని విధంగా ఆశీర్వదించు దేవా!

మాన్యుడవు అసామాన్యుడవు

shanti priya

లోక కళ్యాణార్థం వేల సంఖ్యలో
వచ్చిన ప్రవక్తల వలె ఆవిర్భవించె
మళ్ళీ ఒక కరుణ కలువ
విరబూసింది మానవ వసంతాన

ఆయన దేశకాలాలకు పరిమితమైన
ప్రవక్త కాదు, వినిర్మల హృదయ
విశ్వనాయకుడు అచ్చమైన
అక్షరాల అంతిమ దైవ ప్రవక్త 

ఆయన పలుకులలో తేనెలొలికెను
అంతః కుహరాల తమస్సులు తొలిగెను
తపశ్శక్తులై ఉషస్జ్యోతులై వెలిగెను
మతుల మైల కడిగి మానవత్వం
నాటెను ఆయన దయా దృష్టి వీక్షణల
దివ్యత్వము కాపురముండెను

రుధిర విపాస వెర్రి తలలు వేసిన
మృగ సమాజ మతోన్మాదులు ఆయన
పలుకుల స్వాతిముత్య చినుకుల తాకిడిచె
మానవ ముత్యాలైపోయిరి

బహు విచిత్రమాయన హితోక్తి
వినగానే ధరావతులు ధనాన్వితులు
దళిత నిరువేదల్ని గుండెలకు హత్తుకొనిరి
'సయ్యిదీ' అంటూ గౌరవించిరి

గుండెకాయని నమిలి మింగలేక
ఉమ్మేసినట్టి వారిని చేరదీసి నిజం
ఇదని నచ్చజెవ్పి మెలమెల్లగా మనిషిగా
మలచిన నీవు ముమ్మాటికీ మహా మనీషివే!

కర్కశ హృదయాల్లో కరుణ రసాల్ని పండించి
కుఫ్ర్‌ కారడవిని ఈమాన్‌ కాంతి వనంగా
మలచి మమతల ముత్యాలు జల్లిన
నీవు నిస్సందేహంగా జగద్గురువువే

నెత్తురు వొడిన నేలలో నీతి
అత్తరులను చిల్కించితివె
సతులు చితికి ఆహుతయ్యే భూమిలో
తల్లి పాదాల చెంత స్వర్గమంటివె

ఈ జగాన జీవించిన నీవు
మాన్యుడవు అసామాన్యుడవు
భౌతిక జీవితం పరలోక పంట
పొలం అన్న  మహిమాన్వితుడవు

మనిషికీి - అభిమతానికి మధ్య జరిగిన
భీకర పోరులో కులానికి కాదు
గుణానికే దిగ్విజయమ్మని

చాటిన ధర్మప్రభాకరుడవు 

Wednesday, 19 March 2014

నీకు సాటి నీవేలే


శాంతి ప్రియ

మూఢ నమ్మకాలు నెత్తికెక్కక
అంధ విశ్వాసాలు మేధకందక
నిస్సహాయులై నరులు నిట్టూ
ర్పులు వదిలిన వేళ

నలుపు తెలుపు రంగులలో నరులకు
వెలకట్టి చతుర్వర్ణ తక్కెడలో
మతుల విలువ తూచి అఖిలావని
ఆడపడుచుల అవమానించిన వేళ

స్వేచ్ఛా శంఖం పూరించి కరుణ
కలువలు పూయించి దానవత్వం
మెడలు వంచి మానవత్వం గెలిపించి
శాంతి తంత్రి నినదించి
నీరాజలందుకున్నావు

సత్య సస్య పోరులో
శాంతి ప్రియ జోరులో
ప్రేమ పంచని యోగమెందుకు
మోక్షం ఎరుగని మతం ఎందుకు
మనిషికి మార్గం చూపు నీ ఒక్క
ప్రవచనం పదివేలు

తెల్ల నల్ల తేడాలు లేవని
కుల గోత్ర తిబాదస్తాలు తగవని
వంశ డాంబీకాలు చెల్లవని
మతం మత్తుకీ హితం వెలుగుకీ
గల పొత్తును చూపితివే

మానవ జాతినే మేల్కొల్పావో
సత్య సుగంధాలే వెధజల్లావో
శాంతి పూలే చల్లావో
కరుణ కమలాలే నాటావో
మాటలా అవి? కావు నడిచే
స్వర్గ బాటలు హృదయ గీతికలు
ఇంత పదునా ప్రవక్తల ప్రబోధనాలకు
ఇంత విలువా వారి హితవులకు
పలుకులా? అవి కావు
దివ్యావిష్కృతి వెలుగులే

మనిషి చేరని ప్రజ్ఞ  మీది
మాట కందని విజ్ఞత మీది
దివ్యవాణులు మీ మనో
సీమల్లో నర్తించినవే

తింటివెన్నో రాళ్ళ దెబ్బలు
వింటివెన్నో కరకు మాటలు
నిప్పు కుంపటిలో నిన్ను నెట్టిన
నీతిహీనులను దీవించితివే

సత్యాస్పర్శనం లేని
ప్రవచనం పరిమళరహితం
ప్రవక్తాదర్శం లేని
ప్రపంచం ప్రగతిరాహిత్యం

నరభోక్తలు మానవతను నంజుకు
తింటున్న భయోదయ వేళలో
మిథ్యాశక్తులు సత్యాసక్తులపై విరుచుకు

పడ్డ తమో సంధ్య వేళలో
మెరిసావు ఒక ఆశా కిరణమై
వెలిగావు ఒక శాంతి దీపమై

కళ్ళు మూసుకుపోయిన కామాందులూ
ఒంటి పోతల రాబందులూ
దయ ఎరుగని దురంధరులూ
నిద్దురెరుగరు జన్మలో నీ
శాస్త్ర చికిత్స మోత వింటే

వాదులాడే వితండవాదులు
మార్గం ఎరుగని మార్గభ్రష్టులు
నిజం నమ్మని నీచ మానవులు
పవిత్రులవక ఉందురా నీ
ఆదర్శాలే కంటే

గిరి అంతటి వివేకాన్ని
పద గరిటిలో అందించిన
నీవు నాటికీ నేటికీ
ఏనాటికీ నీకు సాటి
నీవేలే నీకు పోటీ లేదులే

ఆగామి యుగాలకాయన ఆదర్శప్రాయుడు



అబుల్ హసన్

జాడ్యం నిండిన మౌఢ్య పాలనలో -
నిజం కరువైన నీలి సమాజంలో
ఒకే ఒక్కడు అయిన వ్యక్తి ఒక
మహా శక్తయి, మానవ నిర్మాతయి
సౌజన్య ప్రదాతయి, సాత్విక దూతయి
సాగర సహనంతో సత్య శంఖాన్ని
పూరించిన ఉదంత మేనాటికీ
స్ఫూర్తినిస్తూనే ఉంటుంది లోకానికి

సత్యాన్ని బోధించిన నూహ్‌
నియంతల్ని నిలదీసిన ఇబ్రాహీమ్‌
దళిత జనాల పక్షం వహించిన మూసా
సహనానికి తానే ప్రతీకగా నిలిచిన అయ్యూబ్‌
సమాజ శ్రేయస్సు కోసం శిరస్సు అర్పించిన యహ్యా
ధర్మోన్నతికై ప్రాణాలర్పించిన జకరియ్యా
సమానతను బోధించిన ఈసా
క్షమా గుణం తానై నిలిచిన ముహమ్మద్‌
సహన సంపద శాంతి ప్రేమలకు శాశ్వత వారసులు

ఏ ఘోరం చేశాడు బిలాల్‌?
ఏ నేరానికి పాల్పడ్డాడు బిలాల్‌
మండుటెండల్లో మాడే నల్ల సూరీడు
విషమ హింస ఎందుకు ధీరోత్తమునికి
మిథ్యాదైవాల్ని తిరస్కరించినందుకా
అహద్‌, అహద్‌ అని జపించినందుకా
అదే నేరమైతే, సత్యం ఏమైనట్టు?
ఆ మనీషి సహనం పరీక్షకే పరాకాష్ఠ

అధికారం అడగలేదు ఖబ్బాబ్‌
అపకారం చేయలేదు ఉస్మాన్‌
అన్యాయం తలపెట్టలేదు అమ్మార్‌
అధర్మానికి పాల్పడలేదు యాసిర్‌
అసత్యానికి వత్తాసు పలుకలేదు సుమయ్యా
దమన నీతికి దాసోహమనలేదు ముస్‌ఆబ్‌
స్వామి ద్రోహానికి ఒడిగట్టలేదు ఉమ్మె సలమా

ఎందుకు వారు శిక్ష భరించారు తమ
మూపున ఎందుకు నాటారు మేకులు  తనవున
అజ్ఞాన ముసుగు విప్పినందుకా?
మిథ్యా వాదుల్ని నిలదీసినందుకా?
నిజ దైవం అల్లాయేనని నిగ్గు తేల్చినందుకా?
వీడని మిస్టరీ హిస్టరీని ఛేదించినందుకా?
ఏమి తెలుసీ ముష్కరులకు, ముష్రికులకా
మహా ప్రవక్త మహోపదేశం? చిందే
రక్తం, అయ్యే గాయం చేసే ఆర్తనాదం -
''అల్లాహుమ్మహ్‌ది ఖౌమీ ఫయిన్నహుమ్‌ లా
యాలమూన్‌'' -ప్రభూ! నా జాతి జనులకు
సన్మార్గ భాగ్యం ప్రసాదించు. వారు నన్ను,
నిన్నూ గ్రహించలేని వట్టి అమాయకులు స్వామీ!!

ఆర్ద్రంగా ఉంటూనే రుద్రంగా
ధీరంగా ఉంటూనే దుర్గంగా
సంకల్ప వజ్రం ధరియించి
కారుణ్య వర్షం కురిపించి
అభిగమించు సమ చిత్తుడు
ఆగామి యుగాల కాయన
ఆదర్శప్రాయుడు.



జగత్ప్రవక్త చెవ్పిన జీవన సారము



- హసన్‌ సయ్యిద్‌

మనిషి కతిముఖ్య మండనము వినయము
వినయము విశ్వకర్తకు మిక్కిలి ప్రియము
ధర్మపరాయణుల కది మేలిమి బంగారము

జ్ఞాన సముపార్జన కత్యవసరము వినయము
అది లేనిది విద్యార్జన బహు కష్టము
అణకువ కంటే గొవ్పది లేదీ అవనిలోన
అణకువ అందరికినీ శ్రేయోదాయకము
అంతఃప్రజ్ఞుల కది ఆత్మానంద పరవశము

మనుజునకవశ్య ఆభరణము హాస్యము
నరుల నగుమోము సంభాషణము పుణ్యము
మంచి నడత వలన మనుగడ మేలిమగును
చెడు నడవడిక చేయును జీవిత మంధకారము
కడుపే  కైలాసమ్మను వానికి కలిమి లేదు
కరుణ వీడి బ్రతుకు వానికి వేర్మి లేదు

అతిథి సత్కారము చేయువాని జీవితము
పసిడి ఫలాల నందించును నిత్యము
అతిథుల కాహ్వానిస్త్తూ గడిచిన యౌవనము
సుగుణాల సిరితో తులతూగును

హృదయ నందనములో వ్రేమ పరిమళము
నిఖిల ప్రాణుల కది పంచడము సాత్వికము
అదయుల  అంతస్థు అంఘస్సుకే పరిమితము
సదయుల అంతః తేజస్సు అవనికే అందము
అధర్మాని కంతు జూసేందుకు కట్టాలి కంకణము
ధర్మాన్ని స్థాపించేందుకు కావాలి సాహసము
నిజ దేవుడగు అల్లాహ్‌ నిత్య ధ్యానము
నీకూ నాకూ ఇచ్చెను గిరంతటి బలము

తన ధర్మమును గైకొనుచూ దయితుని సేవించు
మేలిమి సుగుణవతికి లభించును స్వర్గ స్వాగతము
పడతికి పరదాయే పావన కవచము
మడఁతికి మానమే మంగళ కరము
నిజ దైవమును గొలుచుచు నీతి బాటన నడుచు
గృహిణి గల గృహము శుభకరము
అది ఇలలోన వెలసిన స్వర్గ వనము
అందులో నిండుగుండును శాంతము

సప్త సముద్రాలు దాటినను సత్యాన్ని వీడని
తనయులే తల్లిదండ్రుల తగు సొత్తు
దివ్యవాణి యంటే చెవి క్రోసుకునువారు
దిక్కుమాలిన తొక్కు పలుకులు విననివారు
సుతులు సుగుణవంతులవడం కన్నా మేలైనదేది?
పుత్రులు ప్రయోజకులవడం కన్నా సంతోషమేది?

తనుజులని జనులు ఉత్తములని పొగడ గనిన
తండ్రి మనసున ఉప్పొంగెను ఉల్లాసము
తమ సంతానము సజ్జన శ్రేష్టులగుట
తల్లిదండ్రులకెంతో ఆనందము
ఎన్ని విధముల సేవించినా తీరునా రుణము?
కన్నవారిపై  కాలు ఎత్తడం తగునా ధర్మము?

నడత ఘనత బహు శ్రేష్ఠము
మంచి నడవడి ఆనందానికి ఆలంబనము
కడు మంచి నడత స్వర్గ్గానికి సోపానము
అబద్ధము అశ్లీలము నరకానికి మార్గము
జగత్ప్రవక్త చెప్పిన ఈ యదార్థము
గ్రహించని ఎట్టి జ్ఞానమైనను, జ్ఞానియైనను వ్యర్థము


Tuesday, 18 March 2014

ప్రవక్త (స) ప్రవచనాలు


అబుల్ హసన్

ప్రవక్త (స) ప్రవచనాలు పూర్ణ ప్రగతికి సోపానాలు
సమతకు, మమతకు ప్రతిరూపాలు
ప్రేమను పెంచే స్తుతి ఆలాపనలు
శాంతిని పంచే మలయ పవనాలు

ప్రవక్త వాక్కుల్లో అమృతం నిండి ఉన్నది
మనిషిలోని కల్మషాన్ని తుడవగలదది
కల్లాకపటం లేని హృదయం ప్రవక్తది
వెన్నెల్లాంటి మనసు ప్రవక్తది

ప్రవక్త అధరాలపై కదలాడు హదీసు వెలుగులు
ప్రజల పాలిట అవి ఆనందాల హరివిల్లు
ప్రవక్త వారి ప్రేమైక చూపులు అవి
మనో చీకటిని తొలగించే జ్యోతులు

ప్రవక్త పలుకులు తీయనైనవి
తేనెకన్నా మిన్నగా మధురమైనవి
ప్రవక్త చూపులు చల్లనైనవి - మరు
మల్లె వలె, నిండు జాబిల్లి వలె తెల్లనైనవి

ఈ ఆదర్శామృతాల్ని -
అమలు పర్చ గల వాళ్లెవరైనా
వజ్ర సంకల్పంతో ముందుకు రండి
అల్లాహ్‌ా వారికి తోడుంటాడు
తన రంగులో వారిని రంగరిస్తాడు
ఊహకందని విధంగా ఉపాధినిస్తాడు
పరిపాలనాధికారాననుగ్రహిస్తాడు
స్వర్గసౌఖ్యాలు ప్రసాదిస్తాడు.




  

ఓ నియంత కావాలి


శాంతి ప్రియ

మౌఢ్యాన్ని నిరసిస్తే
కుమిలిపోతావెందుకో చెప్పు?
సత్యం ఇదని చెబితే ఏమిటి తప్పు?

దైవగ్రంథాన్ని నీళ్లల్లో నానబెట్టమనడం
దైవ గ్రంథ అనువాదాన్ని చదవకూడదనడం
చదివినా ఆలోచించకూడదనడం
ఆలోచించినా తర్కించకూడదనడం
జీవితాన్ని చీకట్లలో మ్రగ్గనీయమనడం

ఇది కళ్ళున్న కబోదుల ఛాందస వాదం!
పూర్వం నుండి -

అడవుల్లో జంతువుల కోసం తవ్వి
ఆకులములతో కప్పేసిన గొయ్యిలా
అడుగడుగునా మూఢాచారాల పెను ఊబి
అట్టహాసంగా కరాళ నృత్యం చేస్తోంది

అమాయక ప్రజల రక్తం త్రాగే
రక్తంతో ఖుర్‌ఆన్‌ వాక్యాల్ని వ్రాసే అతివాదులకు
అర్థమవుతుందా ప్రవక్త (స) వారి సందేశం?
సహిస్తుందా శాంతి సంకేతం??

అందుకే-
విచ్చలవిడిగా థ దిశలా ప్రబలుతున్న
దారుణ హింసా పోకడలను పైశావిక వికృత
వికటాట్టహాసాన్ని
మరింత వికటించకుండా, విస్తరించకుండా
అంతం చేయాలి.

నిజానికి శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం
ఓ నియంత కావాలి!
ఆ నిర్ణేత మీ నుండే రావాలి!!


  

Wednesday, 12 March 2014

ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో...


- అబుల్ హసన్

ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో...
ఈ ప్రతిష్ఠ ఆరాధనాలయంలో
ఎన్ని దివ్యావిష్కృతులు ప్రసరించినాయో
ఈ పవిత్ర కాబా గృహంలో
ఎన్ని తమస్సులు తొలగినాయో

ఈ మక్కా నగర వీధుల్లో
ఎన్ని సత్య స్కృతులు చల్లబడినాయో
ఈ పవిత్ర పట్టణ ప్రాంగణంలో
ఎన్ని లబ్బయిక్‌ నినాదాలు విన్పించినాయో

ఈ నిర్జీవ నల్ల రాతి లోయలో
ఎన్ని వాస్తవాలు ఆవిష్కరించబడినాయో
ఈ బంజరు బీడువారిన అవనిలో
ఎన్ని మానవ రాసి ముత్యాలు దాగినాయో

ఈ అరఫా మైదానం విడిదిలో
ఎన్ని పాపాలు కడగబడినాయో
ఈ మినా మైదాన మట్టిలో
ఎన్ని త్యాగాలు ప్రతిఫలించినాయో

ఈ రమీ జమరాత్‌ల పోరులో
ఎన్ని దుష్ట శక్తులు తరమబడినాయో
ఈ శిరోముండన మేళలో
ఎన్ని దౌష్ట్యాలు పరిత్యజించబడినాయో

ఈ మార్గదర్శక కేంద్రావనిలో
ఎన్ని సమతా రాగాలు ఆలాపించబడినాయో
ఈ సఫా మర్వాల సయీలో
ఎన్ని మాతృ ప్రేమలు ఇంకి ఉన్నాయో
ఈ అతీఖ్‌ గృహ తవాఫ్‌లో
ఎన్ని జీవితాలు ధన్యమయినాయో

ఈ కాంతి శిఖర గుహలో
ఎన్ని దివ్య కాంతులు ప్రకాశించినాయో
ఈ సౌర్‌ గుహ ఒడిలో
ఎన్ని స్నేహ సౌరభాలు గుభాళించినాయో

అందుకే -
ఈ కాబా విశ్వ మార్గదర్శక కేంద్రం అయింది
అందుకే -
ఈ నిఖిల జగతికి నీతి శాస్త్రాన్ని అందించింది.

ఇది మక్కా నగరము



అబుల్ హసన్

ఇది మక్కా నగరము ఇది బక్కా పట్టణము
ఇది సమస్త మానవాళి మార్గదర్శక కేంద్రము

ఇచట ఆది మానవుడు ఆదం హవ్వాను కలిసెను
మానవ ప్రగతికి గట్టి పునాదులు వేసెను
ఇచట ఇబ్రాహీమ్‌ తన ఆలుబిడ్డలను తీసు
కొచ్చి కాబా ఒడిలో వదలి వెళ్ళెను

ఇచట తండ్రీకొడుకులు దైవ గృహాన్ని నిర్మించెను
ఇచట ఇస్మాయీల్‌ ప్రాణ త్యాగానికి సిద్ధమాయెను
ఇచట మూసా ప్రవక్త ముహమ్మద్‌ ప్రవక్త (స)
ధర్మశాస్త్రమ్ము కలిసిపోయి పరిపూర్ణమాయెను

రావోయి సోదరా రమ్ము ప్రియతమ్ముడా ఆఫ్రికా
నుండి, అమెరికా నుండి, ఆసియా నుండి, ఆస్ట్రేలియా నుండి
ఫ్లయిటు ఎక్కి, బస్సు ఎక్కి, ఓడ ఎక్కి, ఒంటె ఎక్కి పొమ్ము
సుమనోహర సుందర కాంతిమయము శాంతి
నిలయము కాబా ప్రాంగణము

మల్ల్లె పూ రంగుల మేలిమి వస్త్రాలతో మోక
రిల్లు జనం కన్పడ ఖంగుతినకు విశ్వాస గణమది
తేనెలొలికించు పద సప్త రాగమాలలు విన్పడ
తెల్లబోకు లబ్బయిక్‌ అల్లాహుమ్మ నినాదమది

దైవ ప్రేమామృతాలు గుండెల్లో నిండగా
దర్శించుము అతీఖ్‌ ప్రతిష్ఠాలయము
అప్పుడు కనవయ్యా దివ్య ప్రదక్షిణ పరిమళాల
జల్లు కాబా గృహ ముగ్ద మనోహర దృశ్యము

అటు నుంచి హజ్రె అస్వద్‌ను ముద్దాడవోయి
అది స్వర్గ సీమ నుండి రాలిన తునకవోయి

తవాఫ్‌ పూర్తి చేసి విశ్రాంతికై సాగి
పొమ్ము జమ్‌ జమ్‌ బావి గట్టు మీద
అచట నిలబడి కనుము జమ్‌ జమ
జలం సేవించు విశ్వాస సమూహమ్మును

అటుపిమ్మట సఫా పర్వతమ్ము ఎక్కా
లోయి అది హాజిరా సాధనకు చిహ్నమోయి
శిరోముండనం లేదా వెంట్రుకలు కత్తిరించ
వోయి, అది చెడు విసర్జనకు గురుతువోయి

మక్కా నగరము నీదే సుమా! నీవు
పరాయివాడవనుకోకు కలలోనైనా
రహ్మాన్‌ అతిథివి అల్లాహ్‌ా రాయబారివి
ఆయన పిలవగ వచ్చిన సౌభాగ్యుడివి

తఖ్వాయే నీ ఆభరణము దైవ స్తుతియే నీకు ఆహారము
సహనమే నీకు సౌందర్యము స్వర్గమే నీ నివాసము

కాబా ఇచ్చే సందేశము -
వేషం వేరైనా, భాష వేెరైనా
రంగులు వేరైనా, సంస్కృతులు వేరైనా విశ్వమంతా
విశ్వకర్త దాసులు జగమంతా ఒకే కుటుంబ సభ్యులు

అపస్వరం


- ముహమ్మద్ గన్నవరం

ఆలోచనను
అక్షరంగా మలిచే క్రమములో
నా కలం, చిత్రకారుని కుంచెలా
ఎల్లప్పుడూ, గాయపడుతూనే ఉంటుంది.

ఒక చక్కటి ఊహను
కుంచెకు అద్ది, ఆ రూపాన్ని రంగుల్లో నాన్చి
కాగితంపై చిత్రించే థలో
చిత్రకారుడు
బహు చిత్రంగా ఓడిపోవడం గెలవడం
మనం, కనులార్పకుండా చూస్తుండిపోతాము

ఏదో ఒక అపస్వరం
వీణను చుట్టముట్టి బాధిస్తున్నట్లు
గేయం, గాయమై రోదిస్తుందా అన్నట్లు
ఆ చిత్ర ప్రయత్నాన్ని
ఊహించని మలుపు ఏదో ఛిన్నాభిన్నం చేస్తుంది

చిత్రకారుడు
అంతుపట్టని ఆవేదనతో
తన వంక, అసంపూర్తిగా ఎదుట నిలిచిన చిత్రం వంక శూన్యంలో తప్పిపోతాడు.

అక్షరం అనంతమై విస్తరించేందుకు
ఆకాశమయి పుష్పించేందుకు
చీకట్లలో మిణుగురు వెలుతురులా
ఒక మెరుపు మస్తిష్కాన్ని వెలిగించి తప్పుకుంటుంది
కవిత కలం నీడలో చిగురిస్తుంది, చిత్రంగా!

మన గురువులు


- ముహమ్మద్‌ హుసైన్‌ బొర్రా

జీవితాన్ని ప్రభావితం చేసేవారు అరుదుగా ఉంటారు
జీవితాన్ని సవ్య దిశలో మలచేవారు వారే అయి ఉంటారు
మదిలో ఆత్మ విశ్వాసమనే విత్తనాన్ని నాటేవారు
విజయమనే గమ్యాన్ని చేరేందుకై జ్ఞానాన్ని సమకూర్చేవారు
చిన్నచిన్న అపజయాల పాలైనప్పుడు గుండెల్లో పొదువుకునేవారు
బాధాతప్త హృదయుడి కనుకొలను నుండి రాలే దుఃఖాశ్రువులను తుడిచేవారు
జీవితాంతం బాధించే దురలవాట్ల నుండి, ధూర్తుల నుండి రక్షించేవారు
కలిమి లేములను ఒక్కలా చూసే సమవర్తులు
జ్ఞానబోధకు తారతమ్యాలను, సామాజిక అంతరాలను
లెక్కించని వారు

విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయమై తమ సుఖసంతోషాలను వదులుకునేవారు
వృత్తినే సర్వస్వంగా భావించి, తాము కొవ్వొత్తుల్లా కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చేవారు  
పిల్లల సాఫల్యమే తమ భాగ్యమని ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడేవారు
మన జీవితపు థా దిశల నిర్దేశకులు
ఆ యశస్వులు మరెవరో కారు మన గురువులు
అందుకే, అందుకే, అందుకే...
నిన్నా, నేడూ, రేపూ, మరెప్పుడూ మన గురువులు సదాస్మరామి

Wednesday, 5 March 2014

దైవ తీర్పు


సయ్యిద్ అబ్దుస్సలాం ఉమ్రి 

వాస్తవాన్ని వక్రీకరించి
అసత్యాన్ని ప్రచారంలో ముంచి
తౌహీద్‌ తత్వాన్ని కత్తిరించి
షిర్క్‌ సడిని ఆపాదించి
మోడులా మిడిసి పడే
ముష్రిక్కు గుండె శిశిరానికి
            'అస్ఫలుస్సాఫిలీన్‌' దైవ తీర్పు
చర్మ చక్షువులకు వెర్రి ఆకర్షణల రంగులు అద్ది
ఆత్మ చక్షువులకు కర్రి మబ్బుల గంతలు కట్టి
జన జీవనాన్ని పాప పంకిలంలో నెట్టి
జన స్రవంతిలో నాస్తకత్వాన్ని ప్రవేశ పెట్టి
పండిత పామరుల్ని తప్పు త్రోవ పట్టించే
దగుల్బాజీ నిశీథ పిపాసులకు
           'నిప్పు కత్తెరలు' దైవ తీర్పు
పంచేద్రియాలను మిథ్యావాదంతో వంచించి
జ్ఞానేంద్రియాలను చీకటి చెరసాల్లో బంధించి
మౌఢ్యాన్ని నరనరాల్లో దట్టించి
పెల్లుబుకే పాప భీతిని, పరలోక ప్రీతిని
నీరు గార్చే నీతి హీనులకు
         'సలసల మరిగే చీము' దైవ తీర్పు
నిజమంటే జడుసుకుని
సత్యమంటే తోక ముడుచుకుని
మిథ్యా నీలి పొగలను
పట్టుకు వ్రేలాడే పూర్ణ అవిశ్వాసులకు
           'నిప్పు భక్షణం' దైవ తీర్పు
షిర్క్‌ నుండి తౌహీదుకి
చీకటి నుండి ప్రభావానికి
నిరాశ నుండి ఆశాసౌధానికి
అశ్రు జలధి నుండి ఆనంద తీరానికి
నరకం నుండి ఫిర్‌దౌస్‌ శిఖరానికి
          నడిపించే మార్పు
          దివ్యావిష్కృతి తీర్పు

ఎవరీ ప్రవక్తలు?


సయ్యిద్ అబ్దుస్సలాం ఉమ్రి 

దేవుడు మనిషిని ప్రవరుఁణ్ణి, స్వేచ్ఛాపరుణ్ణి చేశాడు 
మనిషి బానిసత్వంలో బ్రతకడాన్ని ఇష్టపడ్డాడు
అలా- 
మార్గం మరచిన మానవాళికి మార్గనిర్దేశకులు ప్రవక్తలు 
మనిషికి స్వేచ్ఛను ఇప్పించిన చైతన్యవంతలు ప్రవక్తలు 
ప్రవక్తల పవిత్ర జీవితాల్లో ఎన్నో వీర సంఘటనలు
నేటి చరిత్రకు తెలియని ఎన్నో మహా త్యాగాలు

ఏ దేశమైనా ఏ శతాబ్దమైనా గర్వించదగిన
సత్యం బోధంచిన శాంతి సేనాధిపతులు ప్రవక్తలు
తల్లి చెప్పని వాస్తవాలు తండ్రి చెప్పిని ఎన్నో నిజాలు
సంప్రదింపులతో ఛేదించలేని ఎన్నో సృష్టి నిగూఢాలు
నిండిన జీవిత రహస్య పేటికను మనిషి ముందు తెరిచారు
చిరాకు పరిచే ఎన్నో సమస్యలను పరిష్కరించారు

విశ్రాంతినిచ్చే ఎన్నో నిశిరాత్రి స్తుతి గీతాలు
పగలు విసుగును తొలగించే ఎన్నో ఆరాధనలు 
చెట్లకు చైత్రము వలె, నదులకు శ్రావణం వలె
మనిషికి గుణము జ్ఞానముండాలి అన్నారు. 

ఎన్నో గీతలు, ఎన్నో ఒంపులు, ఎన్నో రంగుల కలయికలు
కళానైపుణ్యానికి పరాకాష్ట సాయం సమయపు హరివిల్లు 
దిగంతాల పటము మీద ఎంతో
విచిత్రమైన చిత్రము ఇంద్రధనస్సు అంటూ 
అద్భుత చిత్రకారుని  కళాదక్షతను చాటి
అర్పించండి మీ మనస్సు మాధవుడికి అన్నారు ప్రవక్తలు

ప్రతి ఇంట శుభాల పంట


శాంతి ప్రియ

ఊరంతా ఆనందాల హరివిల్లు
రమజాను వరాల శుభ జల్లు
ఆత్మ సౌందర్యం కూడిన ఆరాధనతో
ఆస్వాదించండి శుభాల మాసాన్ని

                         షైతాన్‌ను సంకెళ్ళతో బంధించగా
                         ఉపవాసాలు రోజా మొగ్గలై విరియగా
                         వరాలు వానలై కురియగా
                         పుణ్యం 70 రెట్లు పెంచి వేయగా
                         ప్రజలంతా రమజాను రాకను
                         భక్తీ పారవశ్యాలతో స్వాగతిస్తారు

తెలతెల వారక ముందే
తొలి కోడి కూయక ముందే
సుబహ్‌ా సాదిక్‌ అవ్వక ముందే
సహరీ శుభాల తొలి జల్లుతో
రమజాను మాసం కొలువుదీరింది
సాఫల్య దీవెనలు అందుకోండి

                       వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు
                       సాటి వచ్చునా రోజా శుభాలకు
                       సంపద ఎంతున్నా సరితూగునా
                       దైవ కారుణ్య కటాక్షాలకు
                       సంబరాలే జరుపుకోండి
                       శృతి మించక మసలుకోండి

విశ్వాసుల ప్రతి ఇంట
రమజాను శుభాల పంట
స్వచ్ఛమైన వాతావరణంలో
నెమ్మదించిన అంతరాత్మలు
సాత్విక స్నేహ సౌహార్ధాలకు
నిలువెత్తు నిదర్శనాలు
కరుణా రసం పండించే మాసం
ఎటు చూసినా పుణ్యమే పుణ్యం
దానధర్మాలకు రమజాను చిహ్నం
ఔదార్యానికి రమజాను నిలయం
రమజాను మాసంలో ఓ కఫీలన్నా!
కార్మికులకు విశ్రాంతి ఇవ్వరన్నా!!

                       వేయి నెలలకన్నా ఘనమైన రేయి
                       దైవదూతలు భువికి దిగునురోయి
                       దైవ సన్నిధిలో మోకరిల్లు దాసుడోయి
                       పొంగి పొరలిన క్షమాసాగరాన్ని
                       కదలివచ్చిన కారుణ్య కడలిని
                       తనివితీరా ఆస్వాదించవోయి

ఖుర్‌ఆన్‌ పారాయణాల ఛాయలో
తరావీహ్‌ా ప్రార్థనల నీడలో
దైవ వాణి జ్యోతులతో
అంతరాత్మల్ని వెలిగించండి
విశ్వమంతటిలో కాంతిని
విశ్వ జనుల్లో శాంతిని నింపండి

                       రమజాను మాసపు విశిష్ఠత
                       తెలిసి రావాలి లోకానికి
                       ప్రేమించాలి ప్రతి జీవిని
                       పేదల్ని, అనాథల్ని, వితంతువుల్ని


రమజాను పండుగ రావాలి మళ్ళీ మళ్ళీ
మనమంతా కలిసి ఆడాలి తుళ్ళీ తుళ్ళీ


Tuesday, 4 March 2014

ఇస్తిగ్ఫార్‌


ముహమ్మద్ గన్నవరం

అహం హద్దు మీరి
'హింస' వైట్‌ హౌస్‌ ప్రతిరూపంగా మారి
చరిత్ర పుటల్ని రక్తంతో లిఖించినపుడు
ఆ ఎర్రటి అక్షరాల పరావర్తనపు వెలుగుల్లో
ముసల్మానుల మూకుమ్మడి సమాధుల్లో
నీ అందమైన దురహంకార శ్వేత రూపాన్ని
చూసుకుందువుగాని రా!
పుర్రెల గుట్టల్ని - అస్తిపంజరాలతో నిండిన
ఖబరస్తాన్‌లో, మొలుస్తున్న షహీదీల త్యాగాల్ని
తొక్కుకుంటూ రా!
'ఇన్నాలిల్లాహి వ యిన్నా ఇలైహి రాజివూన్‌'
మరో హిట్లర్‌ రూపమెత్తి
ఈ నిశ్శబ్ద శ్మశానాన్ని ఏలుకుందువుగాని రా!

ఒక్క కన్నీటి బొట్టును ఈదేందుకు
ఎన్నెన్ని
తెరచాపలెత్తిన పడవలు కావాలో...
ఒక్క క్షణం ఊహించు
ఒక్కగానొక్క దుఖ్ఖః పొరను దాటేందుకు
ఎన్నెన్ని
చీకటి పొరలలో కాలం పొదిగిన
వెలుగు రేఖలు ప్రసరించాలో...!? ఆలోచించు.

ఒకే ఒక్క కన్నీటి బొట్టు లోతెంతో? అందులో...
ఎన్నెన్ని
జీవితాల వ్యధలు గడ్డకట్టుకున్నవో...!?
కరడు గట్టిన నీ ఎదను ప్రశ్నించు...!?
ఎన్నెన్ని
పవిత్ర హృదయాలు కరిగి
నదులై ప్రవహించి
ఆ కన్నీటి ప్రవాహాల్ని ప్రక్షాళన గావించాలో...!?
ఇకనైనా గుర్తించు

నేనొక నూతన శకానికి నాంది పలుకబోతున్నా
హింసకు తావు లేని
ఓ ఆధ్యాత్మిక వ్యూహాన్ని
నీ దురహంకారంపై ప్రయోగించబోతున్నా
'లా ఇలాహ ఇల్లల్లాహు
ముహమ్మదుర్రసూలుల్లాహ్‌ా'
కల్మషమైన నీ హృదయానికి
కల్మాయే దివ్యౌషధం
అవును ఇస్తిగ్ఫారే నీకు ఉపశమనం
ఇక, ఈ భూగోళంపై శాంతి పతాకం పచ్చపచ్చగా ఎగురవేయబోతున్నా
రా, నాతో చేయి కలుపు!! ఈ ప్రపంచాన్ని
శాంతితో నింపి, కాంతితో వెల్గిద్దాం
ఆ కాంతి కిరణాలలో
'సూరయె ఫాతెహా'
పఠిద్దాం...రా!

ఇస్తిగ్ఫార్‌: హృదయంలో కరడుగట్టిన కల్మషాన్ని కడిగి స్వచ్ఛత కల్గించే ప్రార్థన.

సుభక్తాగ్రేసరులు ఈసా (అ)


శాంతి ప్రియ

ఆదంని కూడా మానవునిగానే
అంతిమ గ్రంథం అభివర్ణిస్తుండగా ఏసును
మానవాతీతుడనుకోలేము కదా!

సృష్టి పూజ ప్రకృతి విరుద్ధం కదా!
సృష్టి మర్మాల్ని గుర్తించక తప్పదు
దాసుడు విశ్వాన్ని సృష్టించలేడు
దేవుడే దాసుడ్ని పుట్టిస్తాడు నిజమే
చరిత్ర సృష్టించింది  మొన్న ఆదం (అ)ను
నిన్న ఈసా (అ)ను నేడు ముహమ్మద్‌ (స)ను!
ఆరాధించేది మనం ఆదంను కాదు
ఈసాను కాదు, ముహమ్మద్‌ను అంతకన్నా
కాదు, వారిని సృష్టించిన అల్లాహ్‌ాను!

ప్రజా హితమే అభిమతంగా
దయారూపమే ప్రియమతంగా
అనురాగమే ఆశయంగా
మార్గదర్శకత్వమే ధ్యేయంగా
జీవించిన సుభక్తాగ్రేసరులు ఈసా!

ఆయన పలికిన నిజం -
అల్లాహ్‌ా స్వరూపమును ఎవరూ చూడలేదు
ఆయనను పోలినది ఏదీ లేదు
అల్లాహ్‌ా అద్వితీయుడు, అమరుడు
నేను నరుణ్ణి, మధ్యవర్తిని, మానవ మాత్రుణ్ణి
నన్ను ప్రభువుగా కొలిచితే సాధ్యమవదు
స్వర్గ ప్రవేశం - ఈ మాట
నేటికీ విశ్వవ్యాప్తంగా ఉన్న
సువార్తల్లోని సజీవ సాక్ష్యం!


మేం మనుషుల్యం


-  శాంతి ప్రియ

 మేం మనుష్యులం - మేం విశ్వాసులం
దైవ దాసులం - సత్య ప్రియులం

మనస్సు లోపలి తమస్సు తొలగించి
అణగారిన సత్యాగ్ని కణం రగిలించి
మమతానురాగాల దివ్వెలు వెలిగించి
కష్ట జనులకై లేచు కరుణ కెరటంలాగా
దుష్ట జనులకై మండు నరక కూపంలాగా
మేం పోరాటానికి సిద్ధం
గెలుపు మాకు తధ్యం

మేం ఉపాసకులం - మాకు లేదు ఏ కులం
పరలోక పిపాసకులం - శాంతి కాముకులం
ధరిత్రి థ దిశల ధర్మ తేజ తోరణాలు కట్టి
మనిషి బ్రతుక్కొక లక్యం పెట్టి, శ్రుతి చుట్టి
మాట మాటకి మంచి బాట లాగ
అడుగు అడుగుకి ఆదర్శ మూట లాగ
మేం ఖుర్‌ఆన పారాయణం చేస్తాం
మేం ప్రవక్త బాటన నడుస్తాం

మేం సత్యవంతులం - అసత్యం మాకు అప్రియం
దైవ భక్తులం - స్వర్గవాసులం
పైశాచిక పోకడల పొత్తి కడుపుల్లో కత్తులు దూసి
భుక్త భక్తుల లోగుట్టుని బయటపెట్టి
రక్త సక్త చరిత్ర రసికుల్ని మట్టుపెట్టి
రోత, రోధ, రసూముల రొంపిని పూడించి
మేం కాంతికారులై వెలుగుతాం
మేం కాత్రి వీరులై ఎదుగుతాం
మేం సుమనస్కులం - కర్కశకం కాదు మా గుణం
సాత్వికులం - సాహసవంతులం
మాలో మౌఢ్యం లేదు, మాలో క్రౌర్యం లేదు
నిమ్నోన్నతలు అసలు లేవు అంటరానితనం మా దరి చేరదు
మాకు కుర్‌ఆన్‌ ఒక గీటురాయి, ధర్మదాయి
మాకు ముహమ్మద్‌ కరుణ చినుకు తురాయిమేం వర్ణ పీడనలు సహించం
మేం మిథ్యా దేవుళ్ళను విశ్వసించం
విశ్వ మానవ సౌభ్రాతృత్వ్యం మా విశ్వకర్త హితం
విశ్వ మానవ కణ్యాణం మా విశ్వనాయకుని అభిమతం

మూఢ నమ్మకాల బూజు దులిపి
మోస మోకపు తలుపు మూసి
దర్గా దురాగల గుట్టు విప్పి
స్వార్థ సంకుచితల చిచ్చు నార్పి
మేం చైతన్య రథసారధులం
మేం నవ సమాజాన్ని స్థాపిస్తాం

ఇందుగ్గాను -
నిలవాలి మీరందరూ ధర్మానికి అండగా!
లేదంటే మీరందరి బ్రతుకులు దండగా!!

Monday, 3 March 2014

ఔరా....!


- అబుల్‌ హసన్‌

తూరుపు సంద్య ఎరుపు అది జీవితపు మరో మలుపు
పడమటి సంద్య ఎరుపు అది పరలోక జీవితానికి విడుపు
              ''అద్దున్యా మజ్రవుల్‌ ఆఖిరా
               మా తజ్‌రా తహ్‌ాస్వుదు''
పుట్టిన ప్రతి జీవికి మరణం తప్పదు
కాటి మట్టిలో కల్పేంత వరకు విధి ఒప్పదు
ఇదేం వింతో గాని జీవితం ఓ మంచు బిందువు
అది ఏదో ఒకనాడు రాలిపోక మానదు
               ''కుల్లు మన్‌ అలైహా ఫాన్‌ వయబ్ఖా
                వజ్హు రబ్బిక జుల్‌ జలాలి వల్‌ ఇక్రామ్‌''
మరణ దూత వాకిల్లో వచ్చి వాలాక
ఏ కోకిలా నీ కోసం పాడదు
ఏ అనందాశ్రువూ నీ కోసం నర్తించదు
ఏ శబ్ధమూ అర్థమై విన్పించదు
ఏ హస్తమూ అభయమై దీవించదు
ఏ క్షణమూ ఆలస్యం అవ్వదు
             ''ఇజా జాఅ అజలుహా లా యస్‌తాఖిరూన
              సాఅతఁవ్‌ వలా యస్‌తఖ్దిమూన్‌''
అస్తమించడానికే ఉదయిస్తాడు సూర్యుడు
వాడిపోవడానికే పూస్తాయు పూలు
నేలకొరగడానికే లేస్తాయి అలలు
చావడానికే పుడతారు ప్రజలు
         ''కుల్లు నఫ్సిన్‌ జాయిఖతుల్‌ మౌత్‌; వ ఇన్నమా
         తువప్ఫౌన ఉజూరకుమ్‌ యౌమల్‌ ఖియామహ్‌ా''
పుష్పాలు పోతేగానీ ఫలములు రావు
నక్షత్రాలు మాయమైతేగానీ సూర్యుడు రాడు
శిశిరం మరణిస్తేగానీ వసంతం రాదు
శ్వాస ఆగితేగానీ సత్యం తెలవదు
              ''వ మల్‌ హయాతుద్దున్యా
               ఇల్లా మతావుల్‌ గురూర్‌''
జీవిత మాధుర్యం చవి చూడాలంటే - హృదయం
దైవ సంస్మరణ స్వాతి చినుకుల్లో తడవాలి; కామ,
క్రోధ, మోహ, మద, మత్సర్యాలను జయించాలి
లేదంటే జీవితం నిరర్థకం అవుతుంది
మనిషి నివాసం నరకం అవుతుంది
               ''ఫమన్‌ జుహ్‌ాజిహా అనిన్నారి వ
                ఉద్ఖిలల్‌ జన్నత ఫఖద్‌ ఫాజ్‌''


సహనమంటే...


శాంతి ప్రియ

సహనమంటే సత్య ప్రవక్తలది
సహనమంటే దయార్ధ్ర హృదయులది
సహనమంటే భువనగగనాలది
ఈ సుగుణం పురుషోత్తములకాభరణం

భగ్గుభగ్గున మండిపోతున్న అగ్గి
రవ్వల మధ్య పడక వేసుకుని కూర్చుని
నిప్పుకే సవాలు విసురుతున్న
ఇబ్రాహీమ్‌ సహనం శ్లాఘనీయం

మల్లెల్లాంటి లేత బుగ్గల బాలుణ్ణి
నడి రేయి కన్న కలలకి ప్రతిగా
మినా మైదానం మధ్యలో గుండె
రాయి చేెసుకుని గొంతు కోసేందుకు
సిద్ధమవుతున్న ఆ తండ్రి సహనానికి జోహార్లు
పితృ వాత్సల్యానికి పరవశించిపోతూ ప్రభువు
ప్రసన్నత కోసం పరితపించిపోతున్న ఆ
పుత్రుని పరమ సహనం నిరుపమానం

ఉక్కు రంపం తన దేహాన్ని
చీల్చుకుంటూ తెగ సాగుతున్నా
శరీరం రెండు ముక్కలయి లెక్క
లేనంత బాధ కలుగుతున్నా కెరటాల్లా
దుఃఖం ఉప్పొంగుతున్నా సహిస్తూ సత్యమే
పలికిన జకరియా సహనం ప్రశంసనీయం

రాళ్ళు రువ్వి నరాల్ని చిట్లగొడుతున్నా మేకులు
దించి నాడుల్ని తెంపేస్తూ నరరూప రాక్షసుల్లా
వికటాట్టహాసం చేస్తూ వేదనకు గురి చేస్తున్నా
తనువు నిండా కరుణ నింపుకుని చల్లని దీవెనతో
మందస్మిత మోముతో మమతల్ని మరిపించే
ఈసా వారి సహనం అమేయం.

ప్రవక్తలే ఒక బీజమైతే మహా ప్రవక్త
ముహమ్మద్‌ ఒక సంజీవ రూపం
ప్రవక్తలే ఒక మూలమైతే
రసూల్‌ వారే మహా వృక్ష  స్వరూపం
ప్రవక్తలే ఒక నెలవంకైతే
నబీ వారే పూర్ణ చంద్రం

ముహమ్మద్‌ (స) శాంత రూపులు, ఆయన
ప్రబోధనమే విశ్వ మానవ సౌభ్రాతృత్వం. ఆయన
దేహం సత్య కాంతం. దాని చల్లని
జ్వలనమే విశ్వకోటికి ఆదర్శం
ఎంత మృదువో ఆయన మాట, మరి అది
ఎట్టి గట్టి, కరడు గట్టిన హృదయాన్నయినా
ఇట్టే చీల్చుకుని లేస్తుంది. మృగత్వం మెడను
వంచి మానవత్వాన్ని శాఖాశిఖలతో వర్థిల్లజేస్తుంది

ముహమ్మద్‌ (స)కు ఉన్న మహత్తు ఏమిటి?
నల్ల శాలువా, తెల్లపాగా, ఎండు రొట్టె
ఆయన మృదు మధుర ప్రబోధనంతోనే ది
గంతములు ప్రచలించలేదా? పరివర్తనం చెందలేదా?

ఏమి ఉన్నదీ మక్కా నగరంలో? ఏ
వేవో ఆచారాలు ఎందరెందరో విగ్రహారాధకులు
కాబా ప్రతిష్టాలయంలో 360 అప్రతిష్ట ప్రతిమలు
అచట పుట్టిన అనాథతోనే అరబ్బు దేశం
ముఖరించలేదా? ధర్మం దశ  దిశల వ్యాపించలేదా?
వైమనస్యం నశించి, సౌమనస్యం వెలుగొందలేదా?
భయం భ్రాంతి వైదొలిగి శాంతి తంత్రి నినదించలేదా?
నిశ్చల పరాక్రమమున్న నిర్మ హృదయులు
మహా ప్రవక్త (స) దుర్దాంత ధీరత్వ వీర
మహిమాన్వితులు మహా ప్రవక్త (స) ఏళ్ళ
తరబడి బానిసలుగా దమించిపోతున్న దళిత
జనాల మోక్ష  అరుణోదయ కిరణం మహా
ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రవక్తోత్తములు.

నేరం


             
- ముహమ్మద్‌ ఖాన్‌ (గన్నవరం)

ఆత్మ సాక్షిగా సాక్ష్యమిస్తున్నా
ఆత్మద్రోహం నేరానికి మించిన మరో నేరం
ఈ సృష్టిలో లేనే లేదని, అది రాజద్రోహ నేరంకన్నా అధికమని.

నేరం ఎరుగని మనిషి ఎవరున్నరు!?
తెలియక చేెసిన నేరం కన్నా
తెలిసి చేసిన నేరమే, మనిషిని అధికంగా హింసిస్తుంది.

మనసు బండరాతిగా రూపాంతరం చెందాక
ముద్దాయి ఎన్ని నేరాలు చేసినా
అవి, నేరాలుగా అతని దృష్టికి రానేరావు
అతనిని, ఏ హింసా హింసించజాలదు.

సున్నితమైన మనసున్న ప్రతి వ్యక్తి
అతని దృష్టిలో
ప్రతి అంశమూ నేర పరిశీలన దృష్టిలోనే ఉంటుంది.

అది, మాటగా కావచ్చు, చేతగా కావచ్చు
మరే రూపమైనా కావచ్చు!
అతని ఆత్మ. నిత్యం హెచ్చరికలు జారీ చేస్తూ
తాకీదులు ఇస్తూ, పరిధి దాటనీయక
ఎంతో కట్టుదిట్టంగా ఉంచి, నియంత్రిస్తూ ఉంటుంది.

మన నేరాలకు, ఘోరాలకు
తనే ప్రతక్ష్యంగా బాధ్యత వహిస్తూ
వాటి పర్యావసానాన్ని, బాధను హింసనూ
తనే మోస్తూ అతి సున్నితంగానే
తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
అలాంటి మనసుపై ఏ చిన్న అపవాదు గాయమై తగిలినా
అలాంటి బాధనూ హింసనూ ఎదుర్కొనే శక్తి లేక
విలవిల లాడుతుంది!

నీచ పవ్రృత్తీ!


- శాంతిప్రియ

స్వచ్ఛమైన ముస్లిం సమాజంలో
తుచ్ఛమైన కోర్కెలను రాజేసిన
దెవ్వరు, నవ్వేనా
క్రొవెక్కిన కబీస్‌!

ఒక్క బాంబు విసిరి
వేల జనాలను బలిగొని
ఏమెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ!
ఛీఛీ! విష వీచీ!

సౌమనస్యమను పేరిట
వైమనస్య పిపాస దీర్చ
శాంతి శ్రేయమను ముసుగున
మారణ హోమ కణం రగిలించ
నెంచు నీచ ప్రవృత్తీ!
ఇదా నీ అసలు ఆకృతీ!

సద్దాం, లాడెన్‌ల సాకున
పెట్రోల్‌ నిధుల కబ్జ
తాలిబాన్‌, అల్‌ఖైదా చాటున
పాపమెరుగని పసికందుల వధ
గాజాపట్టి ప్రజల వ్యధ
సామ్రాజ్య పిపాస బుసలుకొట్టెను లేరా!
నీ కుటిల నీతి పసికడితిమి పోరా!

అన్య దేశాల ప్రగతి పచ్చ
తోరణాలు చూచి ఓర్వక
కళ్ళు మండే కుళ్ళు సంస్కృతి నీది, నీ
నిజ స్వరూపం బాగా తెలుసు మాకు

ఇరాకు దేశమున చొరబడి
దురంతాల దురాక్రమణల కొడిగట్టే
దుర్బుద్ధి తగదురా! హిట్లర్‌
ముస్సోలినీ సోదరా!

ముస్లిం జన సత్వమ్మును
పరీక్షించబోకురా తిరిపమెత్తు
తిరిపజోగి; అది సహనానికి ఏలిక,
సమరానికి జ్వాలిక

పసివాడి ప్రార్థన


- హఫీజుల్లాహ్‌

అనుక్షణం కాబా నా కళ్ళెదుటుండాలి
అనునిత్యం దైవ నామం నా మదిన మెదులుతుండాలి
ప్రతి నిమిషం నా వీనులు ఖుర్‌ఆన్‌ వింటుండాలి
ప్రతి ఘడియ నా అధరాలు సల్లి అలా అంటుండాలి

గోరు ముద్దలూ వద్దు, జోల పాటలూ నాకొద్దు
మణులూ వద్దు, మాణిక్యాలూ నాకొద్దు
నీ అతీఖ్‌ గృహ దర్శనమే నాకు ముద్దు
అదే అదే నా కోరికల సరిహద్దు

అమ్మకు మించిన వరం లేదని
ఆమె పాదాల చెంత స్వర్గం ఉందని
పలికిన ప్రియ ప్రవక్త జన్మస్థలం మక్కా
విశ్వ జనులందరి పాలిట మార్గ
దర్శక కేంద్రం మక్కా

కనులు ప్రసాదించిన ఓ కరుణా నిధీ!
కాబా దర్శన భాగ్యం కలిగించు
వీనులు అనుగ్రహించిన ఓ విశ్వ పాలకా!
మక్కా అజాన్‌ వినే అదృష్టం కల్పించు
చేతులు ప్రసాదించిన ఓ దయాకరా!
కాబా పరదాను స్పృశించే భాగ్యాననుగ్రహించు
                                     (ఆమీన్‌!)




కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా


- శాంతి ప్రియ

ధర్మాన్ని ధరత్రిపై యాథాస్థితిలో నెలకొల్పి
విజ్ఞుల కామృత దివ్యావిష్కృతుల విందులిచ్చి
న్యాయంగా సుమనస్కుల పక్షం వహించి
వంశ డాంబికాల దుష్కృత పరంపరలను త్రెంచిన
ఇలలో అంతిమ ప్రవక్త ముహమ్మద్‌ (స) వంటి
శాంతి కాముకి, కరుణ పిపాసి, సాధు స్వభావి
కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా

ఆయన -
తండ్రి చేతి గోరు ముద్దలు ఎరుగరు సరికదా జననా
నంతరం అనతి కాలంలోనే తల్లి ప్రేమకు దూరమయి
ముక్కుపచ్చలారని వయసులోనే తాత ముత్తలిబ్‌ను కోల్పోయి
అబూ తాలిబ్‌ వాత్సల్య నీడలో పెరిగారు ముహమ్మద్‌ (స)

బీదసాదల పాలిట పెన్నిధని ఖ్యాతి
గాంచిన ప్రణుత గుణము గల ప్రవఁరులు
ప్రజల మేలునాశపడు ప్రవక్తోత్తములు
వ్యర్థ వేషాలకు దూరంగా మసలిన మహితాత్ములు
వృద్ధ జీవులు, వితంత స్త్రీలు, అనాథ ప్రజలు
కోరగా రుణాలిచ్చి ఆదుకొను ఆపద్బాంధవులు
పరుల బాధను తన బాధగా ఎంచు పరి
తపించు పరమ శ్రేయోభిలాషి ముహమ్మద్‌ (స)

అతిథులను సత్కరించు సుభక్తాగ్రేసరులు
నిఖిల దుర్గుణాలను నిర్మూలించినారు
సమస్త సద్గుణాలకు శ్రీకారం చుట్టినారు
విద్యతో విజ్ఞతో విశ్వకర్తను గుర్తించమన్నారు
న్యాయాధిపతి నీతి బాటన నడవమన్నారు
సర్వ ప్రాణుల ఎడల సాత్విక కరుణ
గలవారే శాంతిప్రియ యశస్వులన్నారు
సద్గుణమనే శిఖరంపై కూర్చునవారే
విశ్వాస గణంలో భక్తోత్తములన్నారు

దాసులకు మేలైన ధనం ధర్మమన్నారు
ధర్మంకంటే ఘన లాభపాటి ఈ జగాన లేదన్నారు
మనసున కల్మషం ఉంచుకోవద్దన్నారు
పైపై మెరుగులు అసలొద్దన్నారు
పాప పంకిల పరిసలాకెళ్ళొద్దన్నారు
పుణ్యాలు చేసేవారి మనుగడకే ఆపద లేదన్నారు
అహం రహిత ఆచరణే సర్వోన్నతం అన్నారు
శీలం స్త్రీపురుషుల సిసలైన సంపదన్నారు
శీల రహిత సమాజం శాపమన్నారు
 నర రుధిర దాహమధికమై మారణహోమం సాగుతుంటే
సర్వసంగ పరిత్యాగులమంటూ సొమ్ము వమ్ము చేెస్తుంటే
కోరిన వరాలిస్తామంటూ కొంపలు కూల్చుతుంటే
కోపంతో రగిలిపోయిన కారుణ్యమూర్తి ముహమ్మద్‌ (స)
నక్షత్ర విద్య మిథ్య అంటూ, తాయెత్తు తమస్సుకి
తార్కాణమంటూ, క్షుద్ర విన్యాసాలు క్షమార్హం కాదంటూ
సమర శంఖం పూరించి సత్య కేతనం ఎగురవేసిన
ప్రవక్తలందరి నాయకమన్యులు ముహమ్మద్‌ (స) వంటి
సత్యప్రియుడు, ధీర శాంతుడు, ధర్మపరాయణుడు
కోటికొక్కడు దొరకడు కోరి వెతికినా

అందుకే ఆయనకు ఖుర్‌ఆన్‌ పుష్పాంజలి ఘటిస్తోంది:
''ఇన్నల్లాహ వ మలాయికతహు యుసల్లూన అలన్నబియ్యి
యా అయ్యుహల్లజీన ఆమనూ సల్లూ అలైహి వ సల్లిమూ తస్లీమా''.
(సల్లల్లాహు అలైహి వ ఆలిహి వ సల్లం)

Sunday, 2 March 2014

ఎక్కడికి పోవాలి మనం?


   
                                   

 -శాంతి పియ్ర

ఎక్కడికి పోతున్నాడు మానవుడు?
ఎక్కవలసిన ఫిర్‌దౌస్‌ స్వర్గశిఖరాలపైకా
దిక్కుమాలిన పాపాల నరక కూపాల్లోకా
ఎక్కడికి పోతున్నాడు?
ఏ సుడిగుండాల్లో చిక్కుకుపోతున్నాడు?

సత్య యుగం నుంచి మిథ్యా లోకంలోకి
దూకి, మిథ్యాలోకంలోంచి రాకెట్‌ యుగానికి
ఎగబ్రాకి మళ్ళీ వెనక్కి నడుస్తున్నామా
మనుషుల్ని మనుషులే తిన్న
అమానుష బర్బరయుగంలోకి
అసభ్యతా విష ప్రభంజనం
ఆకులు రాల్చిన జజ్జర యుగంలోకి.

ధనానికున్న విలువ ధర్మానికి లేకుండా పోతోంది
మృగాలకున్న విలువ మానవులకు లేకుండా పోతోంది
బంగారానికున్న విలువ బాంధవ్యానికి లేకుండా పోతోంది
ఇహానికున్న విలువ పరానికి లేకుండా పోతోంది
వేయి తలలతో అక్రమార్జనం విజృంభించి పోతోంది
పడగలు విప్పిన దౌర్జన్యం పైపైకొస్తోంది.

అణ్వస్త్రాలతోపాటు అంతరాలు అంతమవ్వాలి
గ్రహాలతోపాటు ఆగ్రహాలను గెలవాలి
చెట్టాపట్టాలు పట్టుకున్న సౌజన్యం
పట్టాలపై పయనించాలి
ప్రతి అధరంపై దరహాసం చిందాలి.
ప్రతి బీడులో మమతల మల్లెలు పూయాలి.

ఇన్ని మరకలా? ఈ అద్దానికి ఇకనయినా తుడిచి పెట్టు
ఇన్ని రుచులా? ఈ దేహానికి ఇకనయినా వదలి పెట్టు
పోగుల్లాగా తెగిపోతున్న హృదయాల్ని ముడిపెట్టు
పరిస్థితి విషమించక ముందే చేయందించి నిలబెట్టు
తీవెల్లే ఒదిగే పచ్చని భావాలకు శ్రుతి కట్టు
దమన నీతి సాగించే మానవ సైతానుల భరతం పట్టు
మానవ జాతి విముక్తికి నెత్తుట తడిసిన సత్యకేతనానికి జైకొట్టు
సహనాన్ని మడిచి పెట్టీ సవాలంటూ తొడగొట్టు.

ఎక్కడికి పోవాలి మనం?
పాపాలను ప్రకాళించే ప్రార్థనాలయంలోకి
శాతాను వదలగొట్టే శరణాలయంలోకి
ప్రవక్తలు నడచిన సత్యమార్గంలోకి
ప్రభువు కూర్చిన స్వర్గ ధామంలోకి