- శాంతిప్రియ
స్వచ్ఛమైన ముస్లిం సమాజంలో
తుచ్ఛమైన కోర్కెలను రాజేసిన
దెవ్వరు, నవ్వేనా
క్రొవెక్కిన కబీస్!
ఒక్క బాంబు విసిరి
వేల జనాలను బలిగొని
ఏమెరుగనిలా దిక్కులు
చూచు నంగనాచీ!
ఛీఛీ! విష వీచీ!
సౌమనస్యమను పేరిట
వైమనస్య పిపాస దీర్చ
శాంతి శ్రేయమను ముసుగున
మారణ హోమ కణం రగిలించ
నెంచు నీచ ప్రవృత్తీ!
ఇదా నీ అసలు ఆకృతీ!
సద్దాం, లాడెన్‌ల సాకున
పెట్రోల్ నిధుల కబ్జ
తాలిబాన్, అల్‌ఖైదా చాటున
పాపమెరుగని పసికందుల వధ
గాజాపట్టి ప్రజల వ్యధ
సామ్రాజ్య పిపాస బుసలుకొట్టెను లేరా!
నీ కుటిల నీతి పసికడితిమి పోరా!
అన్య దేశాల ప్రగతి పచ్చ
తోరణాలు చూచి ఓర్వక
కళ్ళు మండే కుళ్ళు సంస్కృతి నీది, నీ
నిజ స్వరూపం బాగా తెలుసు మాకు
ఇరాకు దేశమున చొరబడి
దురంతాల దురాక్రమణల కొడిగట్టే
దుర్బుద్ధి తగదురా! హిట్లర్
ముస్సోలినీ సోదరా!
ముస్లిం జన సత్వమ్మును
పరీక్షించబోకురా తిరిపమెత్తు
తిరిపజోగి; అది సహనానికి ఏలిక,
సమరానికి జ్వాలిక

No comments:
Post a Comment