Monday, 3 March 2014

నేరం


             
- ముహమ్మద్‌ ఖాన్‌ (గన్నవరం)

ఆత్మ సాక్షిగా సాక్ష్యమిస్తున్నా
ఆత్మద్రోహం నేరానికి మించిన మరో నేరం
ఈ సృష్టిలో లేనే లేదని, అది రాజద్రోహ నేరంకన్నా అధికమని.

నేరం ఎరుగని మనిషి ఎవరున్నరు!?
తెలియక చేెసిన నేరం కన్నా
తెలిసి చేసిన నేరమే, మనిషిని అధికంగా హింసిస్తుంది.

మనసు బండరాతిగా రూపాంతరం చెందాక
ముద్దాయి ఎన్ని నేరాలు చేసినా
అవి, నేరాలుగా అతని దృష్టికి రానేరావు
అతనిని, ఏ హింసా హింసించజాలదు.

సున్నితమైన మనసున్న ప్రతి వ్యక్తి
అతని దృష్టిలో
ప్రతి అంశమూ నేర పరిశీలన దృష్టిలోనే ఉంటుంది.

అది, మాటగా కావచ్చు, చేతగా కావచ్చు
మరే రూపమైనా కావచ్చు!
అతని ఆత్మ. నిత్యం హెచ్చరికలు జారీ చేస్తూ
తాకీదులు ఇస్తూ, పరిధి దాటనీయక
ఎంతో కట్టుదిట్టంగా ఉంచి, నియంత్రిస్తూ ఉంటుంది.

మన నేరాలకు, ఘోరాలకు
తనే ప్రతక్ష్యంగా బాధ్యత వహిస్తూ
వాటి పర్యావసానాన్ని, బాధను హింసనూ
తనే మోస్తూ అతి సున్నితంగానే
తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటుంది.
అలాంటి మనసుపై ఏ చిన్న అపవాదు గాయమై తగిలినా
అలాంటి బాధనూ హింసనూ ఎదుర్కొనే శక్తి లేక
విలవిల లాడుతుంది!

No comments:

Post a Comment