Wednesday, 12 March 2014

మన గురువులు


- ముహమ్మద్‌ హుసైన్‌ బొర్రా

జీవితాన్ని ప్రభావితం చేసేవారు అరుదుగా ఉంటారు
జీవితాన్ని సవ్య దిశలో మలచేవారు వారే అయి ఉంటారు
మదిలో ఆత్మ విశ్వాసమనే విత్తనాన్ని నాటేవారు
విజయమనే గమ్యాన్ని చేరేందుకై జ్ఞానాన్ని సమకూర్చేవారు
చిన్నచిన్న అపజయాల పాలైనప్పుడు గుండెల్లో పొదువుకునేవారు
బాధాతప్త హృదయుడి కనుకొలను నుండి రాలే దుఃఖాశ్రువులను తుడిచేవారు
జీవితాంతం బాధించే దురలవాట్ల నుండి, ధూర్తుల నుండి రక్షించేవారు
కలిమి లేములను ఒక్కలా చూసే సమవర్తులు
జ్ఞానబోధకు తారతమ్యాలను, సామాజిక అంతరాలను
లెక్కించని వారు

విద్యార్థుల భవిష్యత్తే ధ్యేయమై తమ సుఖసంతోషాలను వదులుకునేవారు
వృత్తినే సర్వస్వంగా భావించి, తాము కొవ్వొత్తుల్లా కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చేవారు  
పిల్లల సాఫల్యమే తమ భాగ్యమని ఉత్తుంగ తరంగంలా ఎగిసిపడేవారు
మన జీవితపు థా దిశల నిర్దేశకులు
ఆ యశస్వులు మరెవరో కారు మన గురువులు
అందుకే, అందుకే, అందుకే...
నిన్నా, నేడూ, రేపూ, మరెప్పుడూ మన గురువులు సదాస్మరామి

No comments:

Post a Comment