శాంతి ప్రియ
మౌఢ్యాన్ని నిరసిస్తే
కుమిలిపోతావెందుకో చెప్పు?
సత్యం ఇదని చెబితే ఏమిటి తప్పు?
దైవగ్రంథాన్ని నీళ్లల్లో నానబెట్టమనడం
దైవ గ్రంథ అనువాదాన్ని చదవకూడదనడం
చదివినా ఆలోచించకూడదనడం
ఆలోచించినా తర్కించకూడదనడం
జీవితాన్ని చీకట్లలో మ్రగ్గనీయమనడం
ఇది కళ్ళున్న కబోదుల ఛాందస వాదం!
పూర్వం నుండి -
అడవుల్లో జంతువుల కోసం తవ్వి
ఆకులములతో కప్పేసిన గొయ్యిలా
అడుగడుగునా మూఢాచారాల పెను ఊబి
అట్టహాసంగా కరాళ నృత్యం చేస్తోంది
అమాయక ప్రజల రక్తం త్రాగే
రక్తంతో ఖుర్‌ఆన్ వాక్యాల్ని వ్రాసే అతివాదులకు
అర్థమవుతుందా ప్రవక్త (స) వారి సందేశం?
సహిస్తుందా శాంతి సంకేతం??
అందుకే-
విచ్చలవిడిగా థ దిశలా ప్రబలుతున్న
దారుణ హింసా పోకడలను పైశావిక వికృత
వికటాట్టహాసాన్ని
మరింత వికటించకుండా, విస్తరించకుండా
అంతం చేయాలి.
నిజానికి శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ కోసం
ఓ నియంత కావాలి!
ఆ నిర్ణేత మీ నుండే రావాలి!!

No comments:
Post a Comment