సయ్యిద్ అబ్దుస్సలాం ఉమ్రి
దేవుడు మనిషిని ప్రవరుఁణ్ణి, స్వేచ్ఛాపరుణ్ణి చేశాడు
మనిషి బానిసత్వంలో బ్రతకడాన్ని ఇష్టపడ్డాడు
అలా-
మార్గం మరచిన మానవాళికి మార్గనిర్దేశకులు ప్రవక్తలు
మనిషికి స్వేచ్ఛను ఇప్పించిన చైతన్యవంతలు ప్రవక్తలు
ప్రవక్తల పవిత్ర జీవితాల్లో ఎన్నో వీర సంఘటనలు
నేటి చరిత్రకు తెలియని ఎన్నో మహా త్యాగాలు
ఏ దేశమైనా ఏ శతాబ్దమైనా గర్వించదగిన
సత్యం బోధంచిన శాంతి సేనాధిపతులు ప్రవక్తలు
తల్లి చెప్పని వాస్తవాలు తండ్రి చెప్పిని ఎన్నో నిజాలు
సంప్రదింపులతో ఛేదించలేని ఎన్నో సృష్టి నిగూఢాలు
నిండిన జీవిత రహస్య పేటికను మనిషి ముందు తెరిచారు
చిరాకు పరిచే ఎన్నో సమస్యలను పరిష్కరించారు
విశ్రాంతినిచ్చే ఎన్నో నిశిరాత్రి స్తుతి గీతాలు
పగలు విసుగును తొలగించే ఎన్నో ఆరాధనలు
చెట్లకు చైత్రము వలె, నదులకు శ్రావణం వలె
మనిషికి గుణము జ్ఞానముండాలి అన్నారు.
ఎన్నో గీతలు, ఎన్నో ఒంపులు, ఎన్నో రంగుల కలయికలు
కళానైపుణ్యానికి పరాకాష్ట సాయం సమయపు హరివిల్లు
దిగంతాల పటము మీద ఎంతో
విచిత్రమైన చిత్రము ఇంద్రధనస్సు అంటూ
అద్భుత చిత్రకారుని కళాదక్షతను చాటి
అర్పించండి మీ మనస్సు మాధవుడికి అన్నారు ప్రవక్తలు

No comments:
Post a Comment