అబుల్ హసన్
ప్రవక్త (స) ప్రవచనాలు పూర్ణ ప్రగతికి సోపానాలు
సమతకు, మమతకు ప్రతిరూపాలు
ప్రేమను పెంచే స్తుతి ఆలాపనలు
శాంతిని పంచే మలయ పవనాలు
ప్రవక్త వాక్కుల్లో అమృతం నిండి ఉన్నది
మనిషిలోని కల్మషాన్ని తుడవగలదది
కల్లాకపటం లేని హృదయం ప్రవక్తది
వెన్నెల్లాంటి మనసు ప్రవక్తది
ప్రవక్త అధరాలపై కదలాడు హదీసు వెలుగులు
ప్రజల పాలిట అవి ఆనందాల హరివిల్లు
ప్రవక్త వారి ప్రేమైక చూపులు అవి
మనో చీకటిని తొలగించే జ్యోతులు
ప్రవక్త పలుకులు తీయనైనవి
తేనెకన్నా మిన్నగా మధురమైనవి
ప్రవక్త చూపులు చల్లనైనవి - మరు
మల్లె వలె, నిండు జాబిల్లి వలె తెల్లనైనవి
ఈ ఆదర్శామృతాల్ని -
అమలు పర్చ గల వాళ్లెవరైనా
వజ్ర సంకల్పంతో ముందుకు రండి
అల్లాహ్‌ా వారికి తోడుంటాడు
తన రంగులో వారిని రంగరిస్తాడు
ఊహకందని విధంగా ఉపాధినిస్తాడు
పరిపాలనాధికారాననుగ్రహిస్తాడు
స్వర్గసౌఖ్యాలు ప్రసాదిస్తాడు.

No comments:
Post a Comment