శాంతి ప్రియ
ఆదంని కూడా మానవునిగానే
అంతిమ గ్రంథం అభివర్ణిస్తుండగా ఏసును
మానవాతీతుడనుకోలేము కదా!
సృష్టి పూజ ప్రకృతి విరుద్ధం కదా!
సృష్టి మర్మాల్ని గుర్తించక తప్పదు
దాసుడు విశ్వాన్ని సృష్టించలేడు
దేవుడే దాసుడ్ని పుట్టిస్తాడు నిజమే
చరిత్ర సృష్టించింది మొన్న ఆదం (అ)ను
నిన్న ఈసా (అ)ను నేడు ముహమ్మద్ (స)ను!
ఆరాధించేది మనం ఆదంను కాదు
ఈసాను కాదు, ముహమ్మద్‌ను అంతకన్నా
కాదు, వారిని సృష్టించిన అల్లాహ్‌ాను!
ప్రజా హితమే అభిమతంగా
దయారూపమే ప్రియమతంగా
అనురాగమే ఆశయంగా
మార్గదర్శకత్వమే ధ్యేయంగా
జీవించిన సుభక్తాగ్రేసరులు ఈసా!
ఆయన పలికిన నిజం -
అల్లాహ్‌ా స్వరూపమును ఎవరూ చూడలేదు
ఆయనను పోలినది ఏదీ లేదు
అల్లాహ్‌ా అద్వితీయుడు, అమరుడు
నేను నరుణ్ణి, మధ్యవర్తిని, మానవ మాత్రుణ్ణి
నన్ను ప్రభువుగా కొలిచితే సాధ్యమవదు
స్వర్గ ప్రవేశం - ఈ మాట
నేటికీ విశ్వవ్యాప్తంగా ఉన్న
సువార్తల్లోని సజీవ సాక్ష్యం!
No comments:
Post a Comment