- హసన్ సయ్యిద్
మనిషి కతిముఖ్య మండనము వినయము
వినయము విశ్వకర్తకు మిక్కిలి ప్రియము
ధర్మపరాయణుల కది మేలిమి బంగారము
జ్ఞాన సముపార్జన కత్యవసరము వినయము
అది లేనిది విద్యార్జన బహు కష్టము
అణకువ కంటే గొవ్పది లేదీ అవనిలోన
అణకువ అందరికినీ శ్రేయోదాయకము
అంతఃప్రజ్ఞుల కది ఆత్మానంద పరవశము
మనుజునకవశ్య ఆభరణము హాస్యము
నరుల నగుమోము సంభాషణము పుణ్యము
మంచి నడత వలన మనుగడ మేలిమగును
చెడు నడవడిక చేయును జీవిత మంధకారము
కడుపే కైలాసమ్మను వానికి కలిమి లేదు
కరుణ వీడి బ్రతుకు వానికి వేర్మి లేదు
అతిథి సత్కారము చేయువాని జీవితము
పసిడి ఫలాల నందించును నిత్యము
అతిథుల కాహ్వానిస్త్తూ గడిచిన యౌవనము
సుగుణాల సిరితో తులతూగును
హృదయ నందనములో వ్రేమ పరిమళము
నిఖిల ప్రాణుల కది పంచడము సాత్వికము
అదయుల అంతస్థు అంఘస్సుకే పరిమితము
సదయుల అంతః తేజస్సు అవనికే అందము
అధర్మాని కంతు జూసేందుకు కట్టాలి కంకణము
ధర్మాన్ని స్థాపించేందుకు కావాలి సాహసము
నిజ దేవుడగు అల్లాహ్ నిత్య ధ్యానము
నీకూ నాకూ ఇచ్చెను గిరంతటి బలము
తన ధర్మమును గైకొనుచూ దయితుని సేవించు
మేలిమి సుగుణవతికి లభించును స్వర్గ స్వాగతము
పడతికి పరదాయే పావన కవచము
మడఁతికి మానమే మంగళ కరము
నిజ దైవమును గొలుచుచు నీతి బాటన నడుచు
గృహిణి గల గృహము శుభకరము
అది ఇలలోన వెలసిన స్వర్గ వనము
అందులో నిండుగుండును శాంతము
సప్త సముద్రాలు దాటినను సత్యాన్ని వీడని
తనయులే తల్లిదండ్రుల తగు సొత్తు
దివ్యవాణి యంటే చెవి క్రోసుకునువారు
దిక్కుమాలిన తొక్కు పలుకులు విననివారు
సుతులు సుగుణవంతులవడం కన్నా మేలైనదేది?
పుత్రులు ప్రయోజకులవడం కన్నా సంతోషమేది?
తనుజులని జనులు ఉత్తములని పొగడ గనిన
తండ్రి మనసున ఉప్పొంగెను ఉల్లాసము
తమ సంతానము సజ్జన శ్రేష్టులగుట
తల్లిదండ్రులకెంతో ఆనందము
ఎన్ని విధముల సేవించినా తీరునా రుణము?
కన్నవారిపై కాలు ఎత్తడం తగునా ధర్మము?
నడత ఘనత బహు శ్రేష్ఠము
మంచి నడవడి ఆనందానికి ఆలంబనము
కడు మంచి నడత స్వర్గ్గానికి సోపానము
అబద్ధము అశ్లీలము నరకానికి మార్గము
జగత్ప్రవక్త చెప్పిన ఈ యదార్థము
గ్రహించని ఎట్టి జ్ఞానమైనను, జ్ఞానియైనను వ్యర్థము

No comments:
Post a Comment